More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో గత 24 గంటల్లో 43,393 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 44,459 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950కు చేరింది. అదే సమయంలో 911 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,05,939కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,98,88,284 మంది కోలుకున్నారు. 4,58,727 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 36,89,91,222 వ్యాక్సిన్ డోసులు వేశారు.

    08-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 91,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 616 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 32 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,461 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 12,946కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 19,14,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 18,69,417 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 31,850 మంది చికిత్స పొందుతున్నారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,02,761 కరోనా పరీక్షలు నిర్వహించగా, 731 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో రెండు కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 993 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,714 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,29,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,14,865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 11,206 మంది చికిత్స పొందుతున్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories