భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో సోమవారం 3,207 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 29 మరణాలు గత 24 గంటల్లో నమోదయ్యాయి. అదే సమయంలో 3,410 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసులు కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,403కి చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4.31కోట్ల మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 5.24లక్షల మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా పంపిణీ అయిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190 కోట్లకు పైగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్రభావం పెరుగుతోందని ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కోవిడ్-19 కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లు ఉన్నాయి.