More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త‌గా 11,451 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో క‌రోనా నుంచి 13,204 మంది కోలుకోగా.. క‌రోనాతో 266 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,42,826 మంది చికిత్స తీసుకుంటున్నారు. రిక‌వ‌రీ రేటు 98.24 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,37,63,104 మంది కోలుకున్నారు. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,61,057కు చేరింది. కేర‌ళ‌లో నిన్న 7,124 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. అదే సమయంలో ఆ రాష్ట్రంలో 7,488 మంది కోలుకున్నారు.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 25,847 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 122 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 46 కొత్త కేసులు నమోదు కాగా.. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,489 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,64,759 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,764 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,966కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,768 కరోనా పరీక్షలు నిర్వహించగా, 320 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 67 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 4 కేసులు గుర్తించారు. అదే సమయంలో 425 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,241 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,50,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 3,458 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,397కి పెరిగింది.

    Trending Stories

    Related Stories