దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో కొత్తగా 37,875 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,96,718కి చేరింది. అదే సమయంలో 39,114 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. దేశంలో కరోనాతో మరో 369 మంది మృతి చెందారని వెల్లడించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,411కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,22,64,051 మంది కోలుకున్నారు. 3,91,256 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 70,75,43,018 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఒక్క కేరళలోనే గత 24 గంటల్లో 25,772 కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 68,097 కరోనా పరీక్షలు నిర్వహించగా 298 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు నమోదు కాగా.. నారాయణపేట, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 325 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,60,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,50,778 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,476 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,888కి పెరిగింది.
07-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 54,970 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,178 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 కేసులు నమోదు కాగా… అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 9 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,266 మంది కరోనా నుంచి కోలుకోగా.. 10 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,23,242కి పెరిగింది. ఇప్పటి వరకు 19,94,855 మంది కోలుకున్నారు. మొత్తం 13,935 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్ కేసులు ఉన్నాయి.