భారతదేశంలో గత 24 గంటల్లో 45,892 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో 44,291 మంది కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557కు చేరింది. అదే సమయంలో 817 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,05,028కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,98,43,825 మంది కోలుకున్నారు. 4,60,704 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకూ 36,48,47,549 వ్యాక్సిన్ డోసులు వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 88 కేసులు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. ఇదే సమయంలో కరోనా బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,710 మంది కరోనాతో మృతి చెందారు. తాజా గణాంకాలతో కలుపుకుని తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 6,29,054కి చేరుకుంది. 6,13,872 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

07-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 83885 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,166 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,019 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 664 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 45 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 21 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,11,231కి చేరగా 18,65,956 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,919 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
