National

లక్ష లోపు నమోదైన కరోనా కేసులు.. 63 రోజుల త‌ర్వాత

భారతదేశంలో 63 రోజుల త‌ర్వాత తొలిసారి ల‌క్ష క‌న్నా త‌క్కువ‌గా రోజువారీ కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో 86,498 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 1,82,282 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,96,473కు చేరింది. మరో 2,123 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,51,309కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,73,41,462 మంది కోలుకున్నారు. 13,03,702 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,61,98,726 మందికి వ్యాక్సిన్లు వేశారు.

07-06-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,32,996 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,933 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 165 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఖమ్మం జిల్లాలో 160 కేసులు గుర్తించారు. నల్గొండ జిల్లాలో 148 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 6 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3,527 మంది కోలుకోగా, 16 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,394కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 5,93,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,64,303 మంది కోలుకున్నారు. ఇంకా 25,406 మందికి చికిత్స కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,800 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 4,872 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 961 కరోనా కేసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 810 మందికి కరోనా సోకింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13,702 మంది కోలుకోగా, 86 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 13 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,63,211 పాజిటివ్ కేసులు నమోదు కాగా 16,37,149 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,14,510 మందికి చికిత్స జరుగుతోంది. ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 11,552కి చేరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + 12 =

Back to top button