More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారత దేశంలో గత 24 గంట‌ల్లో కొత్త‌గా 3,993 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 108 మంది మ‌ర‌ణించారు. 8,055 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశంలో ప్ర‌స్తుతం 49,948 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 179.13 కోట్ల కొవిడ్ డోసుల పంపిణీ జ‌రిగింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,449 కరోనా పరీక్షలు నిర్వహించగా, 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,860 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,84,224 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,525 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 7,547 కరోనా పరీక్షలు నిర్వహించగా, 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 237 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,478 మంది కరోనా బారినపడగా, వారిలో 23,02,862 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 887 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో 14,729 మంది మరణించారు.

    Trending Stories

    Related Stories