భారత దేశంలో గత 24 గంటల్లో 10,79,384 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా కొత్తగా 6,822 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 10,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 220 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఒక్క కేరళలోనే 168 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,014గా ఉంది. ఇప్పటి వరకు 128.76 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేశారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 23కు చేరాయి.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు నిర్వహించగా, 195 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,000కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,77,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,69,328 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,810 మంది చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 18,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 213 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,852 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,57,369 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,030 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,453కి పెరిగింది.