National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో కొత్తగా 31,222 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,58,843కి చేరింది. అదే సమయంలో 42,942 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దేశంలో క‌రోనాతో మ‌రో 290 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,042కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,22,24,937 మంది కోలుకున్నారు. 3,92,864 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 69,90,62,776 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఒక్క‌ కేర‌ళ‌లోనే 19,688 కేసులు న‌మోదు కాగా, 135 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 67,720 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు వెల్లడి కాగా, వనపర్తి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 339 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,50,453 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,505 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,886కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 43,594 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 739 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీటిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 166 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,333 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,22,064కి చేరుకుంది. ఇప్పటి వరకు 19,93,589 మంది కోలుకున్నారు. మొత్తం 13,925 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

nineteen − 2 =

Back to top button