భారత్ లో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో నిన్న 43,733 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 47,240 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,63,665కు చేరింది. అదే సమయంలో 930 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,04,211కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,99,534 మంది కోలుకున్నారు. 4,59,920 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. మొత్తం 36,13,23,548 వ్యాక్సిన్ డోసులు వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,05,186 కరోనా పరీక్షలు నిర్వహించగా, 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు నమోదవ్వగా అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో 2 కేసులు రికార్డు అయ్యాయి. అదే సమయంలో 1,028 మంది కోలుకోగా, 5 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,703 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,28,282 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,13,124 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,455 మంది చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 88,378 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,042 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 665 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 51 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,748 మంది కరోనా నుంచి కోలుకోగా, 28 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,08,065 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 18,61,937 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 33,230 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,898కి పెరిగింది.