భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీగా పెరిగిన కేసులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో 1,74,399 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. మరో 2,427 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,49,186 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,71,59,180 మంది కోలుకున్నారు. 14,01,609 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,27,86,482 మందికి వ్యాక్సిన్లు వేశారు.
06-06-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 97,751 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 1,436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 184 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో 148, నల్గొండ జిల్లాలో 118 కేసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 3,614 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,91,170 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,60,776 మంది ఆరోగ్యవంతులయ్యారు. 27,016 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 3,378కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 83,690 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,976 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,669 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 298 మందికి పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో రాష్ట్రంలో 13,568 మంది కరోనా నుంచి కోలుకోగా, 90 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది మరణించారు. ఇప్పటిరకు ఏపీలో 17,58,339 పాజిటివ్ కేసులు నమోదు కాగా 16,23,447 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,23,426 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 11,466కి చేరింది.