దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
853

భారతదేశంలో కొత్త‌గా 4,362 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో క‌రోనాతో 66 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో క‌రోనా నుంచి 9,620 మంది కోలుకున్నారు. దీంతో భారతదేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,23,98,095కి చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య‌ 54,118గా ఉంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 17,022 కరోనా పరీక్షలు నిర్వహించగా, 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,758 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,83,937 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,710 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి దాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 14,516 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,02,625 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,063 మందికి చికిత్స జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,729 మంది కరోనాతో మరణించారు.