More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. లక్ష కంటే తక్కువ కేసులు

    దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గింది. ల‌క్ష‌కు దిగువ‌న కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో దేశంలో 83,876 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా నుంచి అదే సమయంలో 1,99,054 మంది కోలుకున్నారు. క‌రోనా కారణంగా గత 24 గంటల్లో 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 11,08,938 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం మృతుల సంఖ్య‌ 5,02,874కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 48,434 కరోనా పరీక్షలు నిర్వహించగా… 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,944 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,77,530 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,46,932 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 26,498 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,100కి పెరిగింది.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 28,598 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 2,690 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 518 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 11,855 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,664కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,03,455 పాజిటివ్ కేసులు నమోదు కాగా 22,19,219 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 69,572 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories