More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,41,561కు చేరింది. ఇందులో 3,40,69,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల 4,73,537 మంది మృతిచెందారు. మరో 98,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 552 రోజుల్లో ఇది కనిష్టమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 211 మంది మరణించగా, 8834 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,693 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 54 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 147 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,943 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 6,69,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 3,787 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,999కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల వ్యవధిలో 30,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 154 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 30 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అదే సమయంలో 177 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,730 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,57,156 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,122 మందికి చికిత్స జరుగుతోంది. కరోనాతో మరణించినవారి సంఖ్య 14,452కి పెరిగింది.

    Trending Stories

    Related Stories