భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,833 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,46,687 మంది చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్ కేసులు 203 రోజుల కనిష్టానికి చేరాయి. అదే సమయంలో కరోనా నుంచి కొత్తగా 24,770 మంది కోలుకున్నారు. కరోనాతో 278 మంది మృతి చెందారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య 4,49,538కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 92,17,65,405 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,578 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 218 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 248 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,58,657 మంది కోలుకున్నారు. ఇంకా 4,390 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,924కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 41,523 కరోనా పరీక్షలు నిర్వహించగా, 671 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,272 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,53,863 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,30,503 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,141 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,219కి పెరిగింది.