National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో 44,643 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 41,096 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757కు చేరింది. గత 24గంటల్లో 464 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోవడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,26,754కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,10,15,844 మంది కోలుకున్నారు. 4,14,159 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,329 కరోనా పరీక్షలు నిర్వహించగా 582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 83 కేసులు నమోదవ్వగా.. కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 638 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,817కి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,47,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,35,250 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,744 మంది చికిత్స పొందుతున్నారు.

05-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 82,297 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 428 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 2,003 మంది కరోనా నుంచి కోలుకోగా, 24 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. ఏపీలో ఇప్పటి వరకూ 19,76,141 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,42,371 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,302 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + 8 =

Back to top button