భారత్ లో కరోనా కేసుల అప్డేట్స్.. 111 రోజుల కనిష్టానికి కరోనా కేసులు..!

0
855

భారతదేశంలో గత 24 గంటల్లో 34,703 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 111 రోజుల తర్వాత క‌నిష్ఠ‌ స్థాయిలో న‌మోదైన కేసులు ఇవి. అదే సమయంలో 51,864 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,19,932కు చేరింది. గత 24 గంటల్లో 553 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,03,281కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,52,294 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 101 రోజుల క‌నిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 4,64,357 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 35,75,53,612 వ్యాక్సిన్ డోసులు వేశారు.

05-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఏపీలో గడచిన 24 గంటల్లో 72,731 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,100 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 583 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 22 కేసులను గుర్తించారు. శ్రీకాకుళంలో 48, కర్నూలులో 50, అనంతపురంలో 60, విశాఖ జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,435 మందికి కరోనా నయం కాగా, 26 మంది మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,05,023 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,58,189 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 33,964 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,870కి పెరిగింది.

తెలంగాణలో గత 24 గంటల్లో 1,03,398 కరోనా పరీక్షలు నిర్వహించగా, 808 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 1,061 మంది కరోనా నుంచి కోలుకోగా, 7 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 3,698 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,27,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,12,096 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,704 మంది చికిత్స పొందుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one + one =