More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 4,518 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,779 మంది కోలుకోగా, 9 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 25,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,81,335కి చేరుకుంది. మొత్తం 4,26,30,852 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,701 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ రికవరీ రేటు 98.73 శాతంగా, క్రియాశీల రేటు 0.06 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 8,392 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 63 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 47 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 8, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4, నాగర్ కర్నూలు జిల్లాలో 2, కరీంనగర్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 47 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,93,607 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,88,933 మంది కోలుకున్నారు. ఇంకా 563 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.

    Trending Stories

    Related Stories