More

    కరోనా కేసుల అప్డేట్స్.. లక్షకు చేరువలో రోజువారీ కేసులు..!

    దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 90,928 మంది క‌రోనా సోకిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో క‌రోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. 325 మంది కొవిడ్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉంది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో క‌రోనాకు 2,85,401 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 3,43,41,009కు చేరింది. మృతుల సంఖ్య‌ 4,82,876గా ఉంది. 148.67 కోట్ల‌ డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వేశారు.

    తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వీరిలో 1,520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరుకుంది. ఇదే సమయంలో ఒకరు మృతి చెందగా… 209 మంది కోలుకున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా మృతుల సంఖ్య 4,034కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి 6,75,341 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 9.51 శాతంగా ఉంది. మరో 7,039 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. గత 24 గంటల్లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 434 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇదే సమయంలో 102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,78,376కు చేరుకుంది. ఇప్పటి వరకు 20,62,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 14,499 మంది కరోనా వల్ల మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,848 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Trending Stories

    Related Stories