More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,346 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసుల సంఖ్య 20 వేల కంటే తక్కువగా నమోదు కావడం గత 209 రోజుల్లో ఇదే తొలిసారి. అయితే ఇదే సమయంలో గత 24 గంటల్లో 263 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఈ మరణాల్లో సగానికి పైగా కేరళలో నమోదయ్యాయి. కేరళలో కొత్తగా 8,850 కేసులు నమోదు కాగా 149 మంది మరణించారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 43,135 కరోనా పరీక్షలు నిర్వహించగా 207 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 61 కేసులు నమోదు కాగా.. నిర్మల్, నారాయణపేట, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 239 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,66,753 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,58,409 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,421 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,923కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 30,515 మందికి కరోనా పరీక్షలు జరుపగా, 429 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 89 కొత్త కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 1,029 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,53,192 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,29,231 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 9,753 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,208కి పెరిగింది.

    Trending Stories

    Related Stories