More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 2.27 లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,910 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 7,034 మంది మహమ్మారి నుంచి కోలుకోగా 9 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 53,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,44,62,445కి చేరుకుంది. వీరిలో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,28,007 మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.60 శాతానికి తగ్గిపోయింది. క్రియాశీల రేటు 0.12 శాతంగా, రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 213.52 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న 32.31 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

    Trending Stories

    Related Stories