National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటల్లో 42,982 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 41,726 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,12,114కు చేరింది. నిన్న‌ 533 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,26,290కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,74,748 మంది కోలుకున్నారు. 4,11,076 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

04-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 85,822 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,442 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 477 కేసులు అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 23 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,412 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఆంధ్రప్రదేశ్ లో కరోనా మృతుల సంఖ్య 13,444కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,73,996 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,40,368 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,184 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,12,796 కరోనా పరీక్షలు నిర్వహించగా 623 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదవ్వగా నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 594 మంది కరోనా నుంచి కోలుకోగా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,814కి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,47,229 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,34,612 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,803 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 4 =

Back to top button