More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారత దేశంలో గత 24 గంటల్లో 4,13,699 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 4,270 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,76,817 కి చేరింది. 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 15 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,692 కి చేరింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 11,107 కరోనా పరీక్షలు నిర్వహించగా, 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 55 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 2, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో 1, సిద్ధిపేట జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 49 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,93,544 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 7,88,886 మంది కోలుకున్నారు. 547 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

    Trending Stories

    Related Stories