దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. ఏపీలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదు

0
897

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 795 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 58 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 12,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.03 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.17 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,96,369 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 184.87 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 15,675 కరోనా పరీక్షలు నిర్వహించగా, 17 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 12 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 3, కరీంనగర్ జిల్లాలో 1, నిర్మల్ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 36 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,345 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,963 మంది కోలుకున్నారు. ఇంకా 271 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 2,726 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క కేసును గుర్తించారు. మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 32 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,578 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,04,729 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 119 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.