దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
851

దేశంలో కొత్తగా 5,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,29,57,477కి చేరింది. ఇందులో 4,23,78,721 మంది కరోనా నుంచి బయటపడగా, 5,14,878 మంది మరణించారు. ప్రస్తుతం 63,878 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 289 మంది కరోనా వల్ల మరణించగా, 11,651 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,146 శాంపిల్స్ పరీక్షించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 58 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో మరణాలేవీ సంభవించలేదు. ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,83,278 మంది కోలుకున్నారు. 2,164 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 14,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 288 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వరుసగా మరో రోజు మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,262 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,02,192 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,341కి చేరింది. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.