దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
734

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న‌ దేశంలో 1,27,952 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో క‌రోనా నుంచి 2,30,814 మంది కోలుకున్నారు. క‌రోనా కార‌ణంగా గత 24 గంటల్లో 1,059 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 13,31,648 మంది చికిత్స తీసుకుంటున్నారు. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,01,114కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతం పెరిగింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 79,561 శాంపిల్స్ పరీక్షించగా 2,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 688 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 4,559 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,74,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,39,187 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 30,931 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,097కి చేరుకుంది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 30,886 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,198 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 555 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 9,317 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,97,369 మంది కరోనా బారినపడగా, వారిలో 21,94,359 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 88,364 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,646కి పెరిగింది.