దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
725

భారతదేశంలో గత 24 గంటల్లో 42,625 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 36,668 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,69,132కు చేరింది. నిన్న 562 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోవడంతో భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,25,757కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,33,022 మంది కోలుకున్నారు. 4,10,353 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 48,52,86,570 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న‌ 62,53,741 డోసులు వేశారు.

తెలంగాణలో గత 24 గంటల్లో 1,08,921 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 609 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 81 కేసులు నమోదవ్వగా.. ఇదే సమయంలో 647 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నలుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,46,606కి పెరిగింది. వీరిలో 6,34,018 మంది కోలుకోగా 3,811 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కొత్తగా 1,546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 284 కేసులు, కడప జిల్లాలో అత్యల్పంగా 14 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 1,940 మంది కరోనా నుంచి కోలుకోగా 18 మంది మృతి చెందారు. మొత్తం 13,428 మంది మరణించారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 19,71,554కి పెరగగా 19,37,956 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here