National

కరోనా కేసుల అప్డేట్స్.. కోలుకున్న 2,07,071 మంది..!

భారతదేశంలో గత 24 గంటల్లో 1,32,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 2,07,071 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది. మరో 2,713 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,40,702 కు పెరిగింది. భారతదేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,65,97,655 మంది కోలుకున్నారు. 16,35,993 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 22,41,09,448 మందికి వ్యాక్సిన్లు వేశారు.

03-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 86,223 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 2,308 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,658 కేసులు, అనంతపురం జిల్లాలో 1,041 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 318 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 16,223 మంది కరోనా నుంచి కోలుకోగా, 81 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 13 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 17,28,577 పాజిటివ్ కేసులు నమోదు కాగా 15,78,452 మంది కోలుకున్నారు. ఇంకా 1,38,912 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 11,213కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,261 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 18 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో క‌రోనా నుంచి మ‌రో 3,043 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు 2 శాతానికి త‌గ్గింది. రిక‌వ‌రీ రేటు 99.5 శాతంగా ఉంద‌ని అధికారులు తెలిపారు. ఆస్ప‌త్రుల్లో చేరే వారి సంఖ్య పూర్తిగా త‌గ్గిపోయింద‌ని.. గ్రామాల్లోనూ ప‌క‌డ్బందీగా లాక్‌డౌన్ అమ‌లు కావాల‌ని అధికారులు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 5 =

Back to top button