More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కరోనా కేసులు

    భారతదేశంలో గత 24 గంటల్లో 913 కరోనా కేసులు నమోదయ్యాయి. 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితులు 4,30,29,044కు చేరారు. ఇందులో 4,24,95,089 మంది బాధితులు కోలుకోగా, 5,21,358 మంది మృతిచెందారు. మరో 12,597 మంది చికిత్స పొందుతున్నారు. యాక్టివ్‌ కేసులు 13 వేల దిగువకు చేరడం గత 714 రోజుల్లో ఇదే తొలిసారని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో 13 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 1316 మంది కోలుకున్నారని తెలిపింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 49 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,328 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,927 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 290 మంది చికిత్స పొందుతున్నారు.

    ఒమిక్రాన్‌లోని మరో వేరియంట్ అయిన ‘ఎక్స్ఈ’ కి వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉండడంతో నిపుణులు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ వేరియంటే ఎక్స్ఈ. బీఏ.2 కంటే ఇది 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు. మాస్కులు తీసే సమయం ముందు ఉందని, ఇప్పటికైతే వాటిని ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

    Trending Stories

    Related Stories