దేశంలో మరింత తగ్గుతున్న కరోనా కేసులు..!

0
872

భారతదేశంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా తగ్గుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1,49,394 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర‌, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 1,072 మంది క‌రోనా కారణంగా మరణించగా.. 2,46,674 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 14,35,569 మంది చికిత్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య‌ 5,00,055కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 81,417 శాంపిల్స్ పరీక్షించగా 2,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 649 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,980 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,71,828 మంది కరోనా బారినపడగా, వారిలో 7,34,628 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,096కి చేరింది. ఇంకా 33,104 మంది చికిత్స తీసుకుంటున్నారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 30,578 కరోనా పరీక్షలు నిర్వహించగా… 4,605 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 642 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11,729 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,641కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 22,93,171 పాజిటివ్ కేసులు నమోదు కాగా 21,85,042 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 93,488 మంది చికిత్స తీసుకుంటూ ఉన్నారు.