National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

దేశంలో కొత్త‌గా 11,903 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో క‌రోనా నుంచి 14,159 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,36,97,740కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,51,209 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో గత 24 గంటల్లో క‌రోనా వ‌ల్ల 311 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,59,191కు చేరింది. దేశంలో గత 24గంటల్లో 41,16,230 డోసుల‌ వ్యాక్సిన్ వేశారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 107.29 కోట్ల డోసుల‌ వ్యాక్సిన్ వేశారు.

ఏపీలో గత 24 గంటల్లో 33,437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 48 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో ఐదుగురు కరోనా కారణంగా మృతి చెందారు. 354 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 20,66,929 కేసులు నమోదు కాగా… 20,48,505 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,382 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 37,941 కరోనా పరీక్షలు నిర్వహించగా, 167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,790 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,63,898 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,933 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,959కి పెరిగింది.

Related Articles

Back to top button