భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

0
792

భారతదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3011 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,97,498కి చేరాయి. ఇందులో 4,40,32,671 మంది బాధితులు కోరుకున్నారు. ఇప్పటివరకు 5,28,701 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం 36,126 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 28 మంది మరణించగా, 4301 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.08 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.73 శాతం, మరణాలు 1.2 శాతం ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 218.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.