National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో కొత్తగా 45,352 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,03,289కి చేరింది. అదే సమయంలో 34,791 మంది కోలుకున్నార‌ని.. మ‌రో 366 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,39,895కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,20,63,616 మంది కోలుకున్నారు. 3,99,778 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఒక్క‌ కేర‌ళ‌లోనే 32,097 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,304 కరోనా పరీక్షలు నిర్వహించగా 313 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 77 కొత్త కేసులు నమోదు కాగా, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 354 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,58,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,49,002 మంది కోలుకున్నారు. ఇంకా 5,809 మంది చికిత్స పొందుతున్నారు.

02-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 59,566 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,378 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 242 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 13 కేసులను గుర్తించారు. అదే సమయంలో 1,139 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. కరోనా మృతుల సంఖ్య 13,877కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,16,680 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19,88,101 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,702 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాలను పరిశీలించిన ఆయన రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్దేశించారు. కర్ఫ్యూ ఎత్తివేతకు మరికొంతకాలం వేచిచూద్దామని అన్నారు. వినాయకచవితి ఉత్సవాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించరాదని, చవితి ఉత్సవాలను ఇళ్లకు పరిమితం చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనాలు, ఊరేగింపులను అనుమతించరాదని స్పష్టం చేశారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

nineteen − 18 =

Back to top button