భారతదేశంలో గత 24 గంటల్లో 1,34,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో 2,11,499 మంది కరోనా నుండి కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,41,986కు చేరింది. మరో 2,887మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,37,989కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,63,90,584 మంది కోలుకున్నారు. 17,13,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 22,10,43,693 మందికి వ్యాక్సిన్లు వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,08,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,384 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 307 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,242 మంది కరోనా నుంచి కోలుకోగా.. 17 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,83,228 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,46,536 మందికి కరోనా నయమైంది. ఇంకా 33,379 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,313కి చేరింది.
02-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఏపీలో గత 24 గంటల్లో 98,048 మందిని పరీక్షించగా వారిలో 12,768 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,703 మంది కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 253 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 98 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మొత్తం 11,132 మంది కరోనా కారణంగా మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 15,612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 17,17,156.. వారిలో 15,62,229 మంది కోలుకున్నారు.