దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
868

భారతదేశంలో కొత్త‌గా 6,561 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.అదే సమయంలో 142 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా క‌రోనా నుంచి 14,947 మంది కోలుకున్నారని తెలిపింది. దేశంలో ప్ర‌స్తుతం 77,152 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నార‌ని ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,53,620గా ఉంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,576 కరోనా పరీక్షలు నిర్వహించగా 154 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 266 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటిదాకా తెలంగాణలో మొత్తం 7,89,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,82,519 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,607 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 9,008 కరోనా పరీక్షలు నిర్వహించగా, 101 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 28 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 458 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,054 మంది కరోనా బారినపడగా, వారిలో 23,01,668 మంది కోలుకున్నారు. ఇంకా 1,657 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 14,729 మంది మరణించారు.