భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు.. దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
863

భారతదేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గత 24 గంటల్లో దేశంలో 33,750 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 10,846 మంది క‌రోనా నుంచి కోలుకున్నారని తేలింది. 123 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,95,407గా ఉందని తేలింది. 4,81,893 మంది క‌రోనా వ‌ల్ల ఇప్పటివరకూ దేశంలో ప్రాణాలు కోల్పోయార‌ని అధికారులు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,45,68,89,306 క‌రోనా వ్యాక్సిన్ల డోసులు వాడారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు మధ్యనున్న టీనేజర్లకు కరోనా టీకాలు పంపిణీ చేయనున్నారు. 0.5 మిల్లీ లీటర్ల మోతాదులో టీకా వేస్తారు. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత అంటే 28 రోజులకు రెండో డోసు వేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 24,219 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 165 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 35 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 130 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,486 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,61,729 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,260 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,497కి పెరిగింది.

తెలంగాణలో గడచిన ఒక్కరోజులో 21,679 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 274 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 212 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 227 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,489 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,74,680 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,779 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,030కి పెరిగింది.