More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9,765 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 8,548 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 99,763 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,40,37,054గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 4,69,724గా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,24,96,19,515 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,018 శాంపిళ్లు పరీక్షించగా, 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 153 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,187 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,68,564 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,630 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,993కి పెరిగింది.

    ఏపీలో గత 24 గంటల్లో 29,595 శాంపిల్స్ ని పరీక్షించగా 184 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 183 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 39 కేసులు నమోదు కాగా… కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,73,093 కేసులు నమోదు కాగా… 20,56,501 మంది కోలుకున్నారు. మొత్తం 14,443 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

    Trending Stories

    Related Stories