భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,354 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 197 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,73,889 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,37,91,061కు చేరింది. ఇప్పటివరకు 3,30,68,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,48,573గా ఉంది. దేశంలో కొత్తగా నమోదైన 24,354 కరోనా కేసుల్లో కేరళ నుంచే 13,834 కేసులు ఉన్నాయి. అదే సమయంలో కేరళలో 95 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 46,193 కరోనా పరీక్షలు నిర్వహించగా 220 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 67 కొత్త కేసులు నమోదు కాగా.. నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 244 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,57,665 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,599 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,919కి పెరిగింది.
01-10-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 809 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 161 కరోనా కేసులు వెల్లడి కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదైంది. అదే సమయంలో 1,160 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 14,186 కరోనా మరణాలు నమోదయ్యాయి. 11,142 మంది చికిత్స పొందుతున్నారు.