More

    భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 17,092 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,684 మంది కరోనా నుంచి కోలుకోగా, 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,86,326కి పెరిగింది. వీరిలో 4,28,51,590 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,168 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.14 శాతంగా, క్రియాశీలక రేటు 0.25 శాతంగా, రికవరీ రేటు 98.54 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,84,80,015 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,518 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 462 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 259 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 35 కేసులు గుర్తించారు. అదే సమయంలో 403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,01,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,92,593 మంది కోలుకున్నారు. 4,702 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

    Related Stories