More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 46,617 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 59,384 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఈ లెక్కల ప్రకారం భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,58,251కు చేరింది. అదే సమయంలో 853 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,00,312కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,95,48,302 మంది కోలుకున్నారు. 5,09,637 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

    తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అదుపులోకి వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 91 శాతం కొవిడ్ పడకలు ఖాళీ అయ్యాయని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 55,442 కొవిడ్ పడకలు ఉండగా 4,931 (8.89) శాతం పడకలు మాత్రమే నిండాయి. మిగిలిన 50,511 (91.11 శాతం) పడకలు ఖాళీగా వున్నాయి. ఐసీయూ, వెంటిలేటర్ పడకలు కూడా ఖాళీ అవుతున్నాయి. 21,846 సాధారణ పడకల్లో 871.. 21,751 ఆక్సిజన్ పడకల్లో 2,266.. 11,845 ఐసీయూ పడకల్లో 1,794 బెడ్‌లలో రోగులు చికిత్స పొందుతున్నారు.

    ఇక డెల్టా వేరియంట్ గురించి కాస్త అలర్ట్ గా ఉండాలని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఒకరి నుంచి ఇద్దరికి వ్యాపించిందని.. బ్రిటన్ వైరస్ ఒకరి నుంచి ముగ్గురికి, ఆల్ఫా వైరస్ నలుగురి నుంచి ఐదుగురికి వ్యాపించిందని, డెల్టా వైరస్ ఏకంగా 5.8 శాతం మందికి వ్యాపిస్తోందని నిపుణులు తెలిపారు. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే, అందరికీ వైరస్ సోకడానికి ఇదే కారణమని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతానికైతే డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య దేశంలో తక్కువగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

    Trending Stories

    Related Stories