More

    దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు..!

    భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతూ ఉంది. గత 24 గంటల్లో 3,712 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో మహారాష్ట్ర, కేరళ నుంచే రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొత్తగా 739 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో.. 2,584 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఐదుగురు చనిపోయారు.

    దేశంలో ప్రస్తుతం 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 8.4 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 0.05 శాతంగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4.31 కోట్లను దాటింది. 4,26,20,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 5,24,641 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1.94 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

    Trending Stories

    Related Stories