దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
938

భారతదేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,82,345కు చేరింది. ఇప్పటి వరకూ 4,25,38,976 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించగా, 2723 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీలోనే అత్యధికంగా ఉన్నాయి. దేశ రాజధానిలో 1485 కేసులు నమోదయ్యాయి. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫోర్త్ వేవ్ వార్తలపై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) స్పందించింది. కరోనా ఫోర్త్ వేవ్ పై భయాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. కేవలం కొన్ని జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. దీన్ని ఫోర్త్ వేవ్ గా భావించలేమని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా కరోనా టెస్టులు చేయడంలేదని, తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేసినప్పుడు వచ్చే పాజటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా అధికంగా ఉన్నదని చెప్పలేమని ఐసీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. అధిక సంఖ్యలో టెస్టులు చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తేనే అక్కడ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు భావించాలన్నారు.