National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారత దేశంలో కొత్తగా 8954 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది. ఇందులో 3,40,28,506 మంది కరోనా నుంచి కోలుకోగా.. 99,023 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,69,247 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 10,207 మంది కరోనా నుంచి బయటపడగా, 267 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో కేరళలోనే 4723 కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,24,10,86,850 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,615 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 184 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,75,994 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,68,411 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,591 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,992కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 25,925 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ అని తేలింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదయింది. అదే సమయంలో 134 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,909 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,56,318 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,149 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,442కి పెరిగింది.

Related Articles

Back to top button