More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో కొత్త‌గా 12,514 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో క‌రోనా నుంచి 12,718 మంది కోలుకున్నారు. 251 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ మొత్తం కేసుల సంఖ్య 3,42,85,814కు చేరింది. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో ప్ర‌స్తుతం 1,58,817 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,36,68,560 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,58,437 కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,06,31,24,205 మందికి క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. కేర‌ళ‌లో గత 24 గంటల్లో 7,167 కేసులు నమోదయ్యాయి. 251 మ‌ర‌ణాల్లో 167 మ‌ర‌ణాలు కేర‌ళ‌లోనే సంభ‌వించాయి.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,021 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 121 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులోనే 55 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వనపర్తి, వికారాబాద్, నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,463 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,63,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,009 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,956కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 39,848 శాంపిల్స్ పరీక్షించగా.. 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 87 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 4 కేసులు గుర్తించారు. అదే సమయంలో 675 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,450 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,47,722 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,355 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,373కి పెరిగింది.

    Trending Stories

    Related Stories