దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 277 మంది వైరస్ బారినపడి మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. 28,246 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,48,339గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 89,02,08,007 మందికి కరోనా టీకా ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి టీకా వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 46,190 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 214 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా.. నిర్మల్, నారాయణపేట, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 208 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,65,963 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,57,421 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,624 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,918కి పెరిగింది.
30-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 58,054 శాంపిల్స్ ను పరీక్షించగా.. 1,010 కొత్త కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 218 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత 24 గంటల్లో 1,149 మంది కరోనా నుంచి కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,50,324కి పెరిగింది. మొత్తం 20,24,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,176 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 11,503 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ముంబై లోని మెడికల్ కాలేజీలో కరోనా మహమ్మారి పంజా విప్పింది. కేఈఎం మెడికల్ కాలేజీలో 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 27 మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. 29 మంది విద్యార్థుల్లో 23 మంది ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతుండగా.. ఆరుగురు మొదటి సంవత్సరం విద్యార్థులు. ఇందులో ఇద్దరు విద్యార్థులను చికిత్స కోసం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. కళాశాలలో మొత్తం 1100 మంది వైద్య విద్యార్థులు ఉన్నారని కేఈఎం హాస్పిటల్ డీన్ హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు.