National

భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గడచిన 24 గంటల్లో 17,070 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,189కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.25గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉంది. మొన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 23 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారతదేశంలో కరోనా మరణాల సంఖ్య 5,25,139కు చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. గడచిన 24 గంటల్లో 14,413 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,28,36,906కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 197.74 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేశారు.

Related Articles

Back to top button