దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
898

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 2,745 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 2,236 మంది కరోనా నుంచి కోలుకోగా ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 18,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,60,832కి పెరిగింది. కరోనా నుంచి 4,26,17,810 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,636 మంది కరోనాతో మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 1,93,57,20,807 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.