దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
700

భారతదేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. నిన్న‌ 6,915 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 180 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 16,864 మంది కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 92,472 మందికి చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 4,23,24,550 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా ఉంది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 7,969 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా 71 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, క‌ర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,812 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,00,760 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,325 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,727కి పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 19,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 425 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,88,931 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,81,852 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,968 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 4,111గా ఉంది.