More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. తెలంగాణలో తెరచుకున్న పాఠశాలలు

    భారతదేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది. రోజువారీ కేసుల నమోదులో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే సమయంలో 1,192 మంది కరోనా కారణంగా మృతి చెందగా… 2,54,076 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగాఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,66,68,48,204 డోసుల వ్యాక్సిన్ వేశారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా 2,861 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 4,413 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,63,911 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,22,654 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 37,168 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,089కి పెరిగింది.

    కరోనా మూడో వేవ్ నేపథ్యంలో మూతపడిన తెలంగాణ విద్యాసంస్థలు ఈరోజు తెరుచుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. తాజాగా కరోనా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీబీఎస్ఈ పాఠశాలలు మాత్రం ఈనెల 2 నుంచి ప్రారంభమవనున్నాయి.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 25,284 పరీక్షలు చేయగా.. 5,879 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 12 కేసులను గుర్తించారు. అదే సమయంలో 11,384 మంది ఆరోగ్యవంతులు కాగా, 9 మంది మరణించారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,615కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా 21,51,238 మంది కోలుకున్నారు. ఇంకా 1,10,517 మందికి చికిత్స కొనసాగుతోంది.

    Trending Stories

    Related Stories