National

ఒక్క రోజులో కోలుకున్న వారి సంఖ్య 3,89,851

భారతదేశంలో గడచిన 24 గంటల్లో కొత్త‌గా 2,67,334 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. అదే సమయంలో 3,89,851 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330కు చేరింది. భార‌త్‌లో క‌రోనా కార‌ణంగా గడచిన 24 గంట‌ల సమయంలో 4,529 మంది మరణించారు. మృతుల సంఖ్య 2,83,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,19,86,363 మంది కోలుకున్నారు. 32,26,719 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,58,09,302 మందికి వ్యాక్సిన్లు వేశారు.

భారతదేశంలో రికవరీ రేటు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 81.7 శాతం నుంచి 85.6 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో పాజిటివిటీ రేటు 14.1 శాతంగా ఉందని, మరణాల రేటు 1.1 శాతంగా ఉందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. గత 3 వారాలుగా 199 జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 1.8 శాతం మంది కరోనా బారినపడ్డారని, దేశ జనాభాలో 2 శాతం కంటే తక్కువేనని వివరించారు. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, 10 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో 50 వేల కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ఆయన మంత్రుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 4 =

Back to top button